మండలం చీకోడు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం సాధించి సత్తా చాటారు. ఫైనల్లో అక్బర్పేట - భూంపల్లి జట్టుపై 25-15 తేడాతో విజయం సాధించారు. చీకోడు విద్యార్థులు హారిక, శ్యామల, రశ్మిత, పల్లవి, హరిప్రియ, నందినితో పాటు ఆకారం పాఠశాల విద్యార్థులు మనస్విని, రేష్మిత ఈ పోటీల్లో తమ ప్రతిభను కనబరిచారు. విజేతలకు జిల్లా విద్యాధికారి (డీఈఓ) రమేష్ బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన చీకోడు జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం గూడూరు బాలరాజు, పీఈటీలు, పీడీలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.