సర్పంచులు,ఉప సర్పంచులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచన
ప్రతి పల్లెలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించాలని, సర్పంచులు, ఉప సర్పంచులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుర్ర మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మండల మాట్లాడుతూ...సర్పంచులు, ఉప సర్పంచులు, పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. బతుకమ్మ వేడుకలు జరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. మహిళలు, ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేసి, తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పేలా పండుగను విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.












