జనగామ, 30 June
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించాలని ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన అన్నారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యాచరణపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంతో పాటు ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సమగ్ర అభివృద్ధికి దోహదపడిందని ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన అన్నారు.
సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అమలుపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో వివిధ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక అధికారికి వివరించారు. గ్రామ, వార్డు సభల నిర్వహణ ద్వారా ప్రజల సమస్యలను గుర్తించడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన పది ఇతివృత్తాల (థీమ్స్) మేరకు అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాయని చెప్పారు.
ఈ - ఆఫీస్ ద్వారా 10,000 ఫైళ్లను పరిష్కరించడం జరిగిందని, ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు, దాదాపు 500కి పైగా హెల్త్ క్యాంపుల నిర్వహణ, ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేసేందుకు జిల్లా యంత్రంగం కృషి చేస్తుందని, ప్రజావాణి దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం, వంద శాతం ఈ - ఆఫీస్ నిర్వహణ, అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని వివరణ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ.. ప్రతి శాఖ తమ పరిధిలోని సమస్యలను గుర్తించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే విధంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఉపయోగపడిందన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతర ప్రక్రియగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే మధ్యాహ్న భోజన తయారీని అధికారులు నిరంతరం పరిశీలించాలన్నారు.
ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, గ్రామాలు, పట్టణాల్లో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.










