నర్మెట్ట, నర్మెట్ట, Telangana (ఓరుగల్లు న్యూస్) సెప్టెంబర్ 14
నర్మెట్ట మండల కేంద్రంలో యంగ్ టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, తొలిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత రెండేళ్లుగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఘనంగా వినాయక చవితి వేడుకలు నర్మెట్ట: మండల కేంద్రంలో యంగ్ టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొలిరోజు ప్రత్యేక పూజలు, నిర్వహించారు. గత 2 సంవత్సరాల నుండి మట్టి గణపతిని భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్స్ యూత్ సభ్యులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బాల గంగాధర్ తిలక్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను సామాజిక ఐక్యతకు, యువతలో జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఒక వేదికగా మలిచారని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా యువతలో ఐక్యత, దేశభక్తి, సామాజిక బాధ్యత, సేవా భావం, హిందూ సంస్కృతి–సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పులి కపిల్ ఆదిత్య, చెప్యాల సాహిత్, ప్రజ్ఞపురం శ్రీకాంత్, చెవుల అరవింద్, కొన్నే కార్తీక్, పులి కార్తీక్, శివరాత్రి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.








