వ్యవసాయ భూమి వద్ద పాలు పిండేందుకు వెళ్లిన సిద్దయ్యపై దాడి
జనగామ జిల్లా మండలం కొడవటూరు గ్రామ శివారులో ఎలుగుబంటి దాడిలో రైతు మిన్నలాపురం సిద్దయ్య (60) మృతి చెందారు. ఉదయం తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి బర్రె పాలు పిండుకుంటున్న సమయంలో ఆయనపై ఎలుగుబంటి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ దాడిలో సిద్దయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












