హుస్నాబాద్, 20 November
సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తున్న మహిళ బస్సు ప్రమాదంలో మృతి చెందింది.
సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ మృతి చెందింది.
గురువారం సిద్దిపేటలో నిర్వహించిన సీఎం బహిరంగ సభకు నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ హాజరయ్యారు. సభ ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న సమయంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
ఈ ఘటనతో నాగారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.







