మండలంలోని వెల్దండ గ్రామంలో శనివారం చాకలి ఐలమ్మ 131వ జయంతిని వెల్దండ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజకులు మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో కాసర్ల రాజు, తిరుపతి, శాతెల్లి రాజు, కాసర్ల తిరుపతి, కాసర్ల రాములు, నర్మెట్ట భాస్కర్, ఆగమల్ల ప్రేమ్ కుమార్, కాసర్ల రామ్, శ్యామ్, నర్మెట్ట హరి, కాసర్ల శివ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.












