అంగన్వాడీ కేంద్రానికి గుంట స్థలం విరాళం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి మండలంలోని నర్సాపూర్ గ్రామ సర్పంచ్ కొండ్ర తార కుమార్ దంపతులు ఆదర్శంగా నిలిచారు. అంగన్వాడీ కేంద్రం అవసరాల కోసం వాటర్ ప్లాంట్ సమీపంలోని తమ సొంత భూమిలో కొంత స్థలాన్ని గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని గ్రామాభివృద్ధికి తోడ్పడటంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












