కాజీపేట్, 13-07-2026
హొయగపచహేయ9అేగయయథఅపథోఆహయచేపేపోప.ఈఘపైేోచేయపచే.భయోగొపఈఘగచ.
హన్మకొండ నయీం నగర్ ప్రాంతానికి చెందిన జుహేరియా (19) అనే డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లు కాజీపేట పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే, ఫిర్యాదుదారుడైన అమీర్, కాజీపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారి కుటుంబం (తల్లి నస్రీన్, సోదరి జుహేరియా) గత 4 నెలలుగా హన్మకొండలోని నయీం నగర్ ఏరియాలో అద్దెకు ఉంటున్నారు. గత 10 రోజుల క్రితం జుహేరియా కాలేజీ తరఫున స్టడీ టూర్కు వెళ్లి, 3 రోజుల క్రితం తిరిగి వచ్చింది. అయితే, కుటుంబ సభ్యులకు తెలియకుండా నయీం నగర్లోని ఇల్లు ఖాళీ చేసి, కాజీపేటలోని జూబ్లీ మార్కెట్ ఏరియాలో మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
ఈ విషయమై నిన్న రాత్రి (12.07.2026) సుమారు 9:30 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆమెతో గొడవపడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు భోజనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి, జుహేరియా ఇంట్లోని మధ్య గదిలో సీలింగ్ ఫ్యాన్ హుక్కుకు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే బంధువుల సహాయంతో ఆమెను క్రిందికి దించగా, అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. మృతురాలి చేతులపై 5 నుండి 6 వరకు కోసుకున్న గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
మృతురాలి సోదరుడు అమీర్ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు కాజీపేట సబ్-ఇన్స్పెక్టర్ (SI) బి. శివ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పంచనామా (ఇన్క్వెస్ట్) నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు. ఈ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.








