నర్మెట, ఓరుగల్లు (ఓరుగల్లు న్యూస్) జూలై 11
తకంకువ ధరకు బమగగరంమరమ వికంరయిసంతగరంమమని చెపంపి, నకిలీ బమగగరంమరగరంమనంని వికంరయిమచి ఒక మహిళను మోసమ చేసిన సమఘటన జనగరంమమమడలమలోని కనంనెబోయినగూడెమలో చోటుచేసుకుమది. ఈ ఘటనలో బగరంమధితురగరంమలు 18 తులగరంమల నకిలీ బమగగరంమరగరంమనికి రూ.11 లకంషలు కోలంపోయిమది.
తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని చెప్పి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ బంగారాన్ని విక్రయించిన సంఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని కన్నెబోయినగూడెంలో చోటుచేసుకుంది.
నర్మెట ఎస్సై నైనాల నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కన్నెబోయినగూడెం గ్రామానికి చెందిన గంగరబోయిన ఎల్లమ్మ అనే మహిళ హోటల్ నడుపుకుంటూ ఇంటి వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ నుండి కొందరు వ్యక్తులు ప్రతీ రోజు ఆమె హోటల్‌కు వచ్చి టీ తాగడానికి మూడు, నాలుగు రోజులు వచ్చారు.
తమ దగ్గర బంగారం ఉందని, అది సగం ధరకే విక్రయిస్తామని ఆమెకు మాయమాటలు చెప్పి, ఈ నెల 5వ తేదీన 18 తులాల బంగారం ఇచ్చి, ఆమె వద్ద రూ.11 లక్షలు తీసుకొని వెళ్లిపోయారు. తర్వాత ఆమె అల్లుడు సారబోయిన రాజుకు విషయం చెప్పడంతో బంగారం ను చెక్ పరీక్షించారు. నకిలీ బంగారమని గుర్తించి మోసపోయామని తెలుసుకొని నర్మెట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.








