నర్మెట్ట, 23 July
నర్మెట మండలంలోని గండిరామవరం (మల్లన్నగండి) రిజర్వాయర్‌లో మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ ఒడ్డున మొసలిని గుర్తించిన స్థానికులు, దాని ఫోటోలు, వీడియోలు తీశారు. ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని గండిరామవరం (మల్లన్నగండి) రిజర్వాయర్‌లో మొసలి కలకలం రేపింది. బుధవారం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ ఒడ్డున మొసలి ఉండడాన్ని స్థానికులు గుర్తించి ఫోటోలు, వీడియోలు తీశారు. రిజర్వాయర్‌లో మొసలి కనిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
సాగునీటి అవసరాల కోసం ప్రతిరోజూ రిజర్వాయర్ వద్దకు వచ్చే రైతులు, తాగునీటి కోసం వెళ్లే మూగ జీవాలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు వస్తుండడంతో నీటి మట్టం పెరిగి, సమీప గ్రామాలకు మొసలి వచ్చే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు.
అధికారులు స్పందించి మొసలిని సురక్షితంగా పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.





