నర్మెట్ట, మంగళవారం
నర్మెట్ట మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ వన్ లో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.
నర్మెట్ట మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ వన్ లో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ శృతి హాజరై, గర్భిణీ మరియు బాలింతలకు పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
పుట్టిన వెంటనే పిల్లలకు ముర్రు పాలు అందించాలని, వీటిలో అనేక పోషకాలు ఉంటాయని, తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆమె తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత అనుబంధ పోషకాహారాన్ని అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో అంగన్వాడీ టీచర్లు సృజన, రజిత కుమారి, శోభా దేవి, స్వరూప రాణి, విజయలక్ష్మి, రాజమణి తో పాటు పలువురు గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.











