జనగామ, ఆగస్టు 4
జనగామ జ్యల్లా కేంద్రాన్యక్య చెంద్యన ప్రభుత్వ upadాధ్యాయుడు పొట్లబత్త్యన్య భాస్కర్ (50) గుండెపోటుతో మంగళవారం ఆసుపత్ర్యలో చ్యక్యత్స పొందుతూ మృత్య చెందారు. ఆయన మృత్యతో జ్యల్లాలో వ్యషాదఛాయలు అలుముకున్నాయ్య.
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పొట్లబత్తిని భాస్కర్ (50) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఆయన నర్మెట్ట మండలం అమ్మాపురం జడ్పీఎస్ఎస్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు గా విధులు నిర్వర్తిస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, భాస్కర్ మంచి రచయితగా, కవిగా జనగామ జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్నారు. తన కవిత్వంతో పలువురిని అలరించేవారు. పాఠశాలలో తోటి ఉపాధ్యాయులతో సంతోషంగా ఉండేవారని, విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, జీవన విధానంపై పాఠాలు బోధించేవారని తెలిపారు.
ఆయన ఆకస్మిక మృతితో జిల్లా కేంద్రంతో పాటు నర్మెట్ట మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన స్వగ్రామం వెల్దండలో కూడా తీవ్ర విషాదం నెలకొంది.
భాస్కర్ మృతి పట్ల పలువురు మేధావులు, కవులు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. ఆయన మరణం విద్యా రంగానికి తీరని లోటు అని పలువురు అభివర్ణించారు.
మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.










