తరిగొప్పుల, ఆగస్టు 05
శిశువుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే తొలి టీకా అని, ప్రతి తల్లి పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు అందించాలని అంకుషాపూర్ గ్రామ సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం మండలంలోని అంకుషాపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన, తల్లిపాలపై అవగాహన కార్యక్రమ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని చెప్పారు. పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలను తప్పనిసరిగా బిడ్డకు ఇవ్వాలని, తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు.
అనంతరం సరైన వయస్సులో అన్నప్రాసన చేయడం ద్వారా శిశువు ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉంటుందని వివరించారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకుంటూ శిశు సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అనంతరం గ్రామంలో తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు సందేశం అందించారు. తర్వాత మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు అండాలు, వినోద, నాగపురి రాధ, గర్భిణీలు, బాలింతలు, మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.