న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పలు ఉత్పత్తులను, 2027 కుంభమేళా విశిష్టతను చాటిచెప్పే గంగా మాత ప్రతిరూపాన్ని ముఖ్యమంత్రి ధామి ప్రధానికి బహూకరించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మలారి చేతితో తయారు చేసిన కోటు పట్టీ, దోర్ఖా ఉన్ని వస్త్రం, స్వచ్ఛమైన తేనె, బద్రీ ఆవు నెయ్యి, హర్షిల్ రాజ్మా, ఎర్ర బియ్యాన్ని బహూకరించారు. అలాగే, 2027లో హరిద్వార్‌లో జరగనున్న కుంభమేళా విశిష్టతను చాటిచెప్పేలా గంగా మాత ప్రతిరూపాన్ని అందించారు. ఈ భేటీలో ప్రధాని నుంచి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన మార్గదర్శకత్వం పొందినట్లు ధామి వెల్లడించారు.


