మీడియా (ఓరుగల్లు న్యూస్) అక్టోబర్ 13
అర్హులైన పట్టభద్రులు ఫామ్-18 ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచన
వరంగల్ఖమ్మంనల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల కోసం అర్హులైన పట్టభద్రులు లోపు ఫామ్-18 ద్వారా ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేసుకోవాలని సోషల్ మండల కన్వీనర్ కొండ కుమార్ సూచించారు. గతంలో నమోదైన పట్టభద్రులు కూడా ఈసారి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ముందుగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి, వివరాలను సరిగ్గా నమోదు చేయాలని సూచించారు. గతంలో ఓటరుగా నమోదైన వారు కూడా ఈసారి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కొండ కుమార్ స్పష్టం చేశారు. పట్టభద్రులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా సహకరించాలని ఆయన కోరారు.


