నాణ్యమైన విద్య, భోజనం అందించాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
పాఠశాలల్లో పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. శుక్రవారం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి, 8వ తరగతి విద్యార్థులతో ఆంగ్ల పాఠ్యాంశాలను చదివించారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పెండింగ్లో ఉన్న ఎంఆర్సీ భవన పనులను త్వరగా పూర్తి చేయాలని, డిజిటల్ బోధనా పరికరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు.
ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల అభ్యసన స్థాయిలు, వసతులను పరిశీలించారు. 13 మంది చిన్నారులున్న అంగన్వాడీ నూతన భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే బియ్యం నాణ్యతను తనిఖీ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం తాజా, నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, నీటి సంప్కు మూత ఏర్పాటు చేయాలని, విద్యుత్ స్తంభాలను గ్రౌండ్ వెలుపలికి మార్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












