రఘునాథపల్లి, 2026-11-23
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఆంధ్ర తండా గ్రామ పరిధిలోని ఎర్రగడ్డ తండాకు చెందిన ఇస్లావత్ యాదగిరి కొత్తగా దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఆయన భార్య ఇస్లావత్ ఉమా పేరు మీద 110 ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో చూపిస్తూ విచారణలో దరఖాస్తును తిరస్కరించ
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఆంధ్ర తండా గ్రామ పరిధిలోని ఎర్రగడ్డ తండాకు చెందిన ఇస్లావత్ యాదగిరి కొత్తగా దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఆయన భార్య ఇస్లావత్ ఉమా పేరు మీద 110 ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో చూపిస్తూ విచారణలో దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై లంబాడ హక్కుల పోరాట సమితి () జనగామ జిల్లా అధ్యక్షులు కొర్ర రాజేందర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై బాధితుడు రఘునాథపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కొర్ర రాజేందర్ నాయక్ మాట్లాడుతూ.. బాధితుడు ఇస్లావత్ యాదగిరి పేరు మీద కేవలం 2 ఎకరాల 3 గుంటల భూమి మాత్రమే ఉందని, ఆయన భార్య ఇస్లావత్ ఉమా పేరు మీద కేవలం 3 గుంటల భూమి మాత్రమే ఉందని తెలిపారు. అయితే సర్వే నంబర్ 26/3 భార్య పేరు మీద 110 ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో చూపిస్తూ, ఆ వివరాల్లో అని నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు.
గిరిజన ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక కారణంతో పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం చేయడం తగదని ఆయన అన్నారు. పేద గిరిజనుల సంక్షేమ పథకాలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం, అధికారులు లబ్ధి పొందే ప్రయత్నం చేయకూడదని ఆయన హితవు పలికారు. అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందని ఆయన అన్నారు.
110 ఎకరాల భూమి నిజంగా ఉన్నట్లు నిరూపిస్తే పింఛన్ అవసరం లేదని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు డిమాండ్ చేస్తున్నామని కొర్ర రాజేందర్ నాయక్ అన్నారు. నిజంగా ఆ భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఇస్లావత్ ఉమా పేరు మీద పట్టా మంజూరు చేయాలని, లేనిపక్షంలో 70 శాతం అంగవైకల్యం కలిగిన ఇస్లావత్ యాదగిరికి అర్హత ఆధారంగా తక్షణమే దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రెవెన్యూ రికార్డుల తప్పిదమా, అధికారుల నిర్లక్ష్యమా అన్నది క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీటీసీ భానోత్ బిక్షపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.







