Uttar Pradesh, 15 November
ఉత్తరప్రదేశ్ జిల్లా ముడియారి గ్రామంలో విషాదం - నిమజ్జన ఊరేగింపులో ఘటన
ఉత్తరప్రదేశ్లోని జిల్లాలో డీజే భారీ శబ్దాల కారణంగా 20 రోజుల పసికందు మృతి చెందిన హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మనియార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముడియారి గ్రామంలో ఈ విషాదం జరిగింది. 20 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చిన రీమా దేవి, పుట్టింటిలో తన పసికందుతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఇంటి ముందు నుంచి లక్ష్మీదేవి విగ్రహ నిమజ్జన ఊరేగింపు వెళ్లింది. ఈ క్రమంలో ఊరేగింపు నిర్వాహకులు ఇంటి సమీపంలోనే వాహనాన్ని నిలిపి, అత్యంత భారీ శబ్దంతో డీజే మోగించారు.
కుటుంబ సభ్యుల ఆరోపణలు
డీజే సౌండ్ తగ్గించి, వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాధేయపడినా నిర్వాహకులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ భీకర శబ్దాల తీవ్రతను తట్టుకోలేక పసికందు ఒక్కసారిగా అచేతనంగా మారిపోయింది. గమనించిన తల్లి వెంటనే కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి, చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శిశువు గుండె ఆగి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పోలీసుల చర్యలు
బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, డీజే పరికరాలను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.


