భూపాలపల్లి ప్రాంత ప్రజలకు, రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు భూపాలపల్లిలోని జెన్కో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వెంటనే పరిష్కరించి ప్రజలకు నిరంతరాయంగా కరెంటు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
విద్యుత్ సమస్యలపై పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రత్యేకంగా స్పందిస్తూ.. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం, విద్యుత్ అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 24 గంటల విద్యుత్ సరఫరా ప్రజల హక్కుగా ఉండాలని, విద్యుత్ కోతలతో రైతులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం ప్రజల తరఫున బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహాన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ... ప్రజా అవసరాలకు అనుగుణంగా 24 గంటల విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు సరఫరాలో అంతరాయాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ చేర్యాల మార్కెట్ డైరెక్టర్ వంగ రామరాజు, జిల్లా నాయకులు ఏడెల్లి శ్రీనివాస్ రెడ్డి, తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












