సారాంశం
నాలుగు కేంద్రాల్లో 656 మంది అభ్యర్థులు హాజరు.. పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడి
ముఖ్య విషయాలు
- 1పరీక్ష సమయం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందని, అభ్యర్థులు ఉదయం 11 గంటల లోపు పరీక్ష హాల్లో ఉండాలని సూచించారు.
- 22027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్2027 ఈ నెల 28వ తేదీన (శనివారం) జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- 3జిల్లాలోని ఘన్పూర్ (స్టేషన్) జెడ్పీహెచ్ఎస్ (బాలుర) పాఠశాల, జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ధర్మకంచలో గల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల (బాలుర), కొడకండ్ల మండల పరిధిలో గల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశామని, మొత్తం (656) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
- 4దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా 40 నిమిషాల సమయం ఉంటుందని తెలిపారు.
2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్2027 ఈ నెల 28వ తేదీన (శనివారం) జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని ఘన్పూర్ (స్టేషన్) జెడ్పీహెచ్ఎస్ (బాలుర) పాఠశాల, జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ధర్మకంచలో గల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల (బాలుర), కొడకండ్ల మండల పరిధిలో గల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశామని, మొత్తం (656) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
పరీక్ష సమయం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందని, అభ్యర్థులు ఉదయం 11 గంటల లోపు పరీక్ష హాల్లో ఉండాలని సూచించారు.
దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా 40 నిమిషాల సమయం ఉంటుందని తెలిపారు.