యాదగిరిగుట్ట, 7 October
అటవీ సిబ్బంది సకాలంలో స్పందించి పట్టివేత
మండల కేంద్రంలో, యాదగిరి పల్లి నుండి మైలార్ గూడెం వెళ్లే దారిలో కొండచిలువ ప్రత్యక్షమైంది. రాచకొండ చిన్న రాజు ఇంట్లో 9 అడుగుల కొండచిలువ ఉండటంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.
అటవీ సిబ్బంది సకాలంలో స్పందన
ఈ విషయంపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సమాచారం అందడంతో, స్నేక్ క్యాచర్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను పట్టుకున్నారు.
చివరికి కొండచిలువను సురక్షితంగా పట్టుకోవడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.










