జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, మండలంలోని కన్నబోయిన గూడెం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం పేద వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ రచించబడిందని, అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. ఆయన కలలు కన్న స్వరాజ్యం కోసం కృషి చేయాలని సూచించారు.
విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ, బలహీనవర్గాల రాజ్యాధికారం కోసమే అంబేద్కర్ ఓటు హక్కును తీసుకువచ్చారని, ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోవద్దని, ఓటు హక్కుతో రాజ్యాధికారం మారిపోతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కన్నబోయిన గూడెం సర్పంచ్ భుక్య రమేష్, విగ్రహదాత మాజీ సర్పంచ్ కంతి రాజలింగం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కమిటీ ఆంజనేయులు, ఉపసర్పంచ్ కీర్తి మధు, మాజీ ఎంపిపి తేజావత్ గోవర్ధన్, సర్పంచులు గొపగోనిని శ్రీధర్ గౌడ్, పగిడిపాటి రాజు పాల్గొన్నారు.








