అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అణచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూడటం సిగ్గుచేటని బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్వి ఎలాంటి పిలుపునివ్వకపోయినా, ముందస్తు అరెస్టులతో విద్యార్థి సంఘం నాయకులను, పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను సీఎం మర్చిపోతున్నారు
ఇలాంటి అరెస్టులతో ఏమీ జరగదని, తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులతో జైలు శిక్ష అనుభవించిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులకు ఉందనే సంగతి సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోతున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలు అయ్యిందనే సీఎం అయ్యోమయానికి గురి అవుతున్నారని అన్నారు. అరెస్టు అనంతరం స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు.









