మండల కేంద్రంలోని తహసీల్థార్ కార్యాలయంలో మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగళి జగన్మోహన్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ కొండ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మధ్యాహ్నం 12.30 గంటలకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందించే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచులు, మాజీ వార్డు సభ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మండల, గ్రామ యూత్ అధ్యక్షులు, మాజీ డైరెక్టర్లు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, వివిధ గ్రామాల సోషల్ మీడియా ఇన్చార్జీలు కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
తహసీల్థార్ కార్యాలయంలో రేపు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
Share:

సారాంశం
మధ్యాహ్నం 12.30 గంటలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత
ముఖ్య విషయాలు
- ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మధ్యాహ్నం 12.30 గంటలకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్నట్లు తెలిపారు.
- కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందించే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
- మండల కేంద్రంలోని తహసీల్థార్ కార్యాలయంలో మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగళి జగన్మోహన్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ కొండ కుమార్ తెలిపారు.
- కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
350ఆర్టికల్స్
89,796వ్యూస్










