భగత్‌సింగ్ స్ఫూర్తితో విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా పోరాడాలని జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్వీ ఒకేషనల్ కళాశాలలో ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి లవకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ, భగత్‌సింగ్ చివరి క్షణం వరకు పుస్తక పఠనాన్ని కొనసాగించారని తెలిపారు. శాస్త్రీయ ఆలోచన, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఏకీకరణ పేరుతో పాఠశాలల సంఖ్యను తగ్గించే ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థులు ఫీజులు చెల్లించలేక చదువుకు దూరమయ్యే పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేయాలని, సాంకేతిక, ఉన్నత విద్యలో విద్యార్థులకు అందుతున్న అవకాశాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నల్లా సాత్విక్‌రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి బైరపాక జగన్, జిల్లా కమిటీ సభ్యుడు గొడుగు రమేష్, జిల్లా నాయకులు రంజిత్, సాయిరాజు, మనోజ్‌తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.












