మండల కేంద్రంలో గిరిజన భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్పీఎస్) జనగామ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్ మండల తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మండల కేంద్రంలో గిరిజన భవన్ నిర్మిస్తే గిరిజన సమాజ సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గిరిజనుల ఐక్యతను పెంపొందించడంతో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు గిరిజన భవన్ అవసరమని పేర్కొన్నారు.
గిరిజనుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి, భవన్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ రాజు నాయక్, గిరిజన సర్పంచులు మహేందర్ నాయక్, శ్రీను నాయక్, మండల నాయకులు లకపతి నాయక్, సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.












