లోక కల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారికి అభిషేకం
హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధేశ్వరాలయాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ సందర్శించి, స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని, ఎల్ నీ నో ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మంత్రి స్వామివారిని ప్రార్థించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.












