రైతుల పశువులను దొంగిలిస్తున్న ముఠాకు చెందిన నలుగురు నిందితులను బచ్చన్నపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం, గత నెల 25న కొన్నె గ్రామంలో పశువుల దొంగతనానికి పాల్పడి, అడ్డుకున్న గ్రామస్థులను బెదిరించి నిందితులు పరారయ్యారు. తిరిగి దొంగతనాలకు వచ్చిన వారిని వాహన తనిఖీల సమయంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితులు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహమ్మద్ సాదిక్ ఖురేషీ, మహమ్మద్ అబ్దుల్లా, మహమ్మద్ షేక్ రెహాన్, మహమ్మద్ వాజిద్ ఖురేషీగా గుర్తించారు. వారి నుంచి బొలెరో వాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి నర్మెట్ట, బచ్చన్నపేట, సిద్దిపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పశువుల దొంగతనాల కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో సహకరించిన నర్మెట్ట సీఐ పెండ్యాల దేవేందర్, బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బందిని జనగామ ఏసీపీ భీమశర్మ, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అభినందించారు.
పశువుల దొంగల ముఠా అరెస్ట్
Share:

సారాంశం
నలుగురు రిమాండ్
ముఖ్య విషయాలు
- ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం, గత నెల 25న కొన్నె గ్రామంలో పశువుల దొంగతనానికి పాల్పడి, అడ్డుకున్న గ్రామస్థులను బెదిరించి నిందితులు పరారయ్యారు.
- రైతుల పశువులను దొంగిలిస్తున్న ముఠాకు చెందిన నలుగురు నిందితులను బచ్చన్నపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- నిందితులు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహమ్మద్ సాదిక్ ఖురేషీ, మహమ్మద్ అబ్దుల్లా, మహమ్మద్ షేక్ రెహాన్, మహమ్మద్ వాజిద్ ఖురేషీగా గుర్తించారు.
- తిరిగి దొంగతనాలకు వచ్చిన వారిని వాహన తనిఖీల సమయంలో పోలీసులు పట్టుకున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
453ఆర్టికల్స్
1,11,838వ్యూస్







