గ్రామాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ సర్పంచ్ భూక్య రవి నాయక్ ...
మండలంలోని బొత్తలపర్రె గ్రామంలో గ్రామాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ సర్పంచ్ భూక్య రవి నాయక్ నేతృత్వంలో వీవో భవనానికి మరమ్మతు పనులు చేపట్టారు. భవనం వినియోగానికి అనుకూలంగా ఉండేలా అవసరమైన పనులను ప్రారంభించారు. గ్రామంలో మహిళా సంఘాల కార్యకలాపాలకు వీవో భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, భవనాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనికి ప్రాధాన్యం ఇస్తూ దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్యా రవి, వార్డు సభ్యులు, జీపీవో గూగులోత్ తిరుపతి, కార్యదర్శి రవేందర్, మాజీ ఎంపీటీసీ ముడికే కుమార్ తదితరులు పాల్గొన్నారు.












