హైదరాబాద్, 13 November
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఫాక్స్ సాగర్ కు మహర్దశ పట్టనుంది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఫాక్స్ సాగర్ కు మహర్దశ పట్టనుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఫాక్స్ సాగర్ అభివృద్ధి పనులకు పూజ చేసి పనులు ప్రారంభించనున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
కోట్లాది రూపాయల నిధులు
తెలంగాణ ప్రభుత్వం ఫాక్స్ సాగర్ మరమ్మత్తుల కోసం కోట్లాది రూపాయలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఇప్పటికే చెట్లు, పొదలు శుభ్రం చేసి అభివృద్ధి పనులకు సిద్ధం చేశారు.
పర్యాటక కేంద్రంగా మార్పు
ఈరోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న కమిషనర్ రంగనాథ్, చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కంకణ బద్ధులై పని చేస్తున్నామని అన్నారు.






