నెల్లుట్ల గ్రామానికి చెందిన చింత యాదయ్య మరణించిన నేపథ్యంలో, ఆయన నివాసానికి వెళ్లి సర్పంచ్ నర్సింగ రామకృష్ణ గారు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, గ్రామశాఖ అధ్యక్షుడు మాచర్ల మహేందర్, మండల కార్యదర్శి కొయ్యడ రామలింగం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ రమేష్, మాజీ ఎంపీటీసీ మోటే వీరస్వామి, వార్డు సభ్యుడు నల్ల అజయ్, బొజ్జం సునీత ప్రభాకర్, నాయకులు జగ్గం ఆనంద్, మారబోయిన ఉప్పలయ్య, నల్ల రాం నరసయ్య, నర్సింగ కిరణ్, నల్ల స్వామి, గోంగళ్ళ వెంకటయ్య, మిడతపెళ్లి పరుశరాములు, నల్ల సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.






