తరిగొప్పుల, 14 November
మండల ప్రజలు పోలీసులకు సహకరించాలి ఎస్సై చెన్నకేశవులు
జనగామ జిల్లా కేంద్రంలో గతంలో సబ్ ఎస్సై గా విధులు నిర్వహించి,బదిలీపై తరిగొప్పుల మండలనికి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చెన్నకేశవులను బీఆర్ఎస్ మండల యువజన నాయకుడు దామెర మైకేల్ ఆధ్వర్యంలో యువజన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై చెన్నకేశవులకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన నాయకులు ఉదయ్ కిరణ్,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.






