సందర్భంగా (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 15
సిద్దిపేటలో ఈ నెల 19న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నంగునూరు ఏఎంసీ వైస్ చైర్మన్, సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్ కోరారు. ఈ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని, అలాగే మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిచ్చే ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పవన్ కుమార్ పేర్కొన్నారు. అందుకే నంగునూరు మండలం నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా తరలివచ్చి సభలో పాల్గొనాలని కోరారు.
సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ శ్రేణులంతా సిద్ధమై సభకు తరలిరావాలని, చలో సిద్దిపేట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాదుల పవన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపోల్. రాజ్ బహుదూర్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రెటరీ రంగు అశోక్, ఏఎంసి డైరెక్టర్లు ఎండీ ఇమ్రాన్, గొట్టం రంగారెడ్డి, తిప్పని రాజేశ్వర్, జీవన్ నాయక్ ప్రభాకర్, చేర్యాల కృష్ణా, పాక్స్ డైరెక్టర్ కరెడ్ల వెంకట్ రెడ్డి, కాటం కనకయ్య, గడ్డం కర్ణాకర్ రెడ్డి, పదిరే శ్యామ్ రెడ్డి, పిల్లి మహేష్, బర్రె సంతోష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బోజా రాములు, నాయిని సంపత్ రెడ్డి, మాదే మహేష్, నంగునూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


