సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామాల్లో మంగళవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చిన్నకోడూరు గ్రామానికి చెందిన చెరుకు నాగరాజు (25) తొలిసారిగా అయ్యప్ప స్వామి మాల ధరించాడు. అతని అన్న చెరుకు కనకరాజు గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరిస్తూ, దుద్దెడలో నివాసం ఉంటూ అక్కడే సన్నిధానం ఏర్పాటు చేసుకుంటున్నాడు. దీంతో నాగరాజు కూడా అన్న ఇంటికి వచ్చి అయ్యప్ప స్వామి దీక్షను కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ వ్రతం, అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన వారికి సౌకర్యంగా ఉండేందుకు ఇంటి ముందు టెంట్ వేస్తున్న సమయంలో, ఇనుప పైపులు ఇంటి ముందు ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో నాగరాజు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. తొలిసారిగా అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి మొక్కులు చెల్లించుకుంటాడని భావించిన కుటుంబ సభ్యులు, నాగరాజు విద్యుత్ షాక్తో మరణించడంతో జీర్ణించుకోలేక శోకసముద్రంలో మునిగిపోయారు. కొద్ది రోజుల క్రితం అతనితో కలిసి ఉన్న అయ్యప్ప స్వాములు కూడా కన్నీరుమున్నీరయ్యారు.
అయ్యప్ప మాలధారణలో విషాదం: విద్యుత్ షాక్ తో యువకుడి మృతి
Share:

సారాంశం
కార్తీక పౌర్ణమి సందర్భంగా టెంట్ వేస్తుండగా దుర్ఘటన; కుటుంబ సభ్యుల రోదనలు
ముఖ్య విషయాలు
- చిన్నకోడూరు గ్రామానికి చెందిన చెరుకు నాగరాజు (25) తొలిసారిగా అయ్యప్ప స్వామి మాల ధరించాడు.
- సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామాల్లో మంగళవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
- అతని అన్న చెరుకు కనకరాజు గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరిస్తూ, దుద్దెడలో నివాసం ఉంటూ అక్కడే సన్నిధానం ఏర్పాటు చేసుకుంటున్నాడు.
- ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ వ్రతం, అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Mergoju Brahmachary
Reporter
Kondapak
23ఆర్టికల్స్
792వ్యూస్

