కొండపాక్, 19 November
మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల పత్రాలను గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్ లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంక్షేమ పథకాల ప్రాముఖ్యత
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు చేయూత పింఛన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.