కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గద్దల నర్సింగరావు తీవ్రంగా విమర్శించారు. 100 రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకుల సమావేశం
నర్మెట్ట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చింతకింది సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దల నర్సింగరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పూర్తిగా విఫలమైందని అన్నారు. బాకీ కార్డులు, కల్యాణ లక్ష్మీ, రైతు బీమా రద్దు, పెన్షన్ పెంపు వంటి కీలక హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఎత్తి చూపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కంతి ఆంజనేయులు, మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, సర్పంచులు బానోత్ మహేందర్, భూక్యా రమేష్, నాయకులు కంతి రాజలింగం, పండుగ రమేష్, పిట్టల రాజు, గుడికందుల నరహరి, పండుగ మల్లేశం, కున్సోత్ జయరాం నాయక్, మూల కిరణ్, కిషన్, భూక్యా జీవన్, బానోత్ సంపత్, శంకర్, కృష్ణ, బానోత్ రవి, మెడబోయిన రాజు, మలోత్ రమేష్, రావుల నరేందర్, బెల్లి కనకయ్య, పన్నీరు అరవింద్, బానోత్ రవి, అరకావత్ కొముర తదితరులు పాల్గొన్నారు.









