ముంబైలోని భెండీ బజార్ ప్రాంతంలో ఉన్న అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత నివాస భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఈ భవనం వక్ఫ్ సంస్థకు చెందినదని, ఆదేశాలను పట్టించుకోకుండా కూల్చివేత చేపట్టారని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.
ముంబైలోని భెండీ బజార్ ప్రాంతంలో ఉన్న అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత నివాస భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే విధించింది. హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్ఖానా పేరుతో ఉన్న ఈ భవనాన్ని ప్రమాదకరమైనదిగా గుర్తించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ () కూల్చివేత పనులు ప్రారంభించింది. అయితే ఈ ఆస్తి వక్ఫ్ సంస్థకు చెందినదని, గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా కూల్చివేత చేపట్టారని ఇద్దరు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన న్యాయమూర్తులు మహేశ్ చంద్ర త్రిపాఠి, అద్వైత్ సేథ్నా ధర్మాసనం తదుపరి కూల్చివేత పనులు నిలిపివేసి, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇప్పటికే భవనంలోని కొంత భాగాన్ని కూల్చివేశారు. ఈ వ్యవహారంపై తమ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుంది.






