సిద్దిపేట, 2026-11-24
జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్ ఎన్నిక రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ప్రకటన
జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకొని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చింతల విజయ్ కుమార్‌ను నియమించారు.
జిల్లా ఉపాధ్యక్షులుగా జాజల చందు, మందాల బాబు, కుంభాల రమేష్, అధికార ప్రతినిధిగా ధార స్వామి, కార్యదర్శులుగా నలుమాల నవీన్, నిమ్మ నితిన్, తుక్కోజి సతీష్, ప్రచార కార్యదర్శిగా తాండ్ర నరసింహులు, కార్యనిర్వాహక కార్యదర్శిగా తలారి నరసయ్యను నియమించారు. యువజన విభాగం కార్యదర్శిగా గుమ్మడి సాయి శ్రీరామ్, మీడియా సెల్ ఇన్చార్జిలుగా పుట్టరాజు, జాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా మండల యాదగిరి, గుడుమల్ల సత్తయ్యలను నియమిస్తూ ప్రకటించారు.
నూతన కమిటీకి జిల్లా స్థాయిలో పూర్తి నిర్వహణ బాధ్యతలు చేపట్టే అధికారాలను కల్పిస్తూ నియామకాలు చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ, నూతన కమిటీ సభ్యులు జిల్లాలో నిజాయితీగా పనిచేయాలని, ఎక్కడైనా మాల జాతికి అన్యాయం జరిగినా ముందుండి పోరాడాలని సూచించారు. మాలల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ సిద్దిపేట జిల్లాను ముందంజలో నిలపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మేడి అంజయ్య, వెన్నరాజు, బుట్టి సత్యనారాయణ, రాష్ట్ర పొలిట్‌బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు, రాష్ట్ర సాంస్కృతిక సారథి కన్వీనర్ ఎలుక దేవయ్య, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి కాల్వ నరేష్, కంబాల రవి, దుండ్ర సుమన్, సుంకే రమేష్, డ్యాగాల సతీష్, దార మల్లయ్య, బందెల గోపాల్, సాయిపరమేశ్వర్ తదితర కులబాంధవులు పాల్గొన్నారు.





