22 నవంబర్ 26 ఓరుగల్లు న్యూస్ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 22
నంగునూరు: అక్కెనపల్లి పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థినులు కరాటేలో అద్భుత ప్రతిభ కనబరిచారు. మూడవ ప్రెసిడెంట్స్ కప్ ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో వారు సత్తా చాటారు. ఈ పోటీల్లో ఎన్. నిత్య స్వర్ణ పతకాన్ని, నిక్షిత కాంస్య పతకాన్ని సాధించారు.
ఆదివారం హుస్నాబాద్‌లో నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్‌లో విజేతలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తరి పద్మ, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ సెన్సాయ్ బి. రమేష్ తదితరులు అభినందనలు తెలిపారు.
పాఠశాల యాజమాన్యం అభినందనలు
విద్యార్థినులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించిన కరాటే టీచర్ భూక్య అనితను పాఠశాల ప్రిన్సిపాల్ మంద జానయ్య అభినందించారు. విద్యార్థినుల విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విజేతలను సీనియర్ అధ్యాపకులు డా. ఎస్. శ్రీనివాస్, సి.హెచ్. రజని, ఎ. శ్రీనివాస్, ప్రభాకర్, మహేందర్, రవీందర్, సంధ్య, ముంతాజ్, శ్రీనివాస్, షబానా తదితర ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.







