మద్దూరు, 2026-11-25
మర్మాముల గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని గ్రామ సర్పంచ్ శ్రీ సుందరగిరి సత్యనారాయణ గౌడ్, మద్దూరు మండల ఏపీఓ మంజుల గారితో కలిసి ఈరోజు పరిశీలించారు. ఊర చెరువులోకి నీటి ప్రవాహం కోసం కల్వర్టు, ఫీడర్ ఛానల్ నిర్మాణ స్థలాలను కూడా అధికారులు పరిశీలించారు.
మర్మాముల గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని గ్రామ సర్పంచ్ శ్రీ సుందరగిరి సత్యనారాయణ గౌడ్, మద్దూరు మండల ఏపీఓ మంజుల గారితో కలిసి ఈరోజు పరిశీలించారు. అలాగే, గ్రామ ఊర చెరువులోకి బండనాగారం మత్తడి ద్వారా వచ్చే నీటి ప్రవాహానికి, ఆ గ్రామ సర్పంచ్ ఇజ్జగిరి రాములు వ్యవసాయ భూమి వద్ద కల్వర్టు నిర్మాణం మరియు ఫీడర్ ఛానల్ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి పాల్గొన్నారు.







