నర్మెట్ట, జూలై 8
నటంలంగసపటీలోఅంతగతవభేదలతసథయచేయ.ంలఅధయషపదవఎనననేపథయంలోపటీంగచీలపోయంద.సీనయల,జూనయలగవపోయననయలవేవేగపటీయలనవహసతూయతలలోఅయోయంసృషటసతనన.ఈపణలపైసథనపజల,యతలఆందోళనవయతంచేసతనన.
అధికార పార్టీలో మండల అధ్యక్ష పదవి చిచ్చు రేపింది. దీంతో నర్మెట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, జూనియర్లు అంటూ రెండుగా చీలిపోయి, పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా చేపట్టింది. ఈ నెల గురువారం బొమ్మకూర్ గ్రామానికి చెందిన రావుల బిక్షపతిని మండల అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు డీసీసీ నుండి నియామక పత్రం అందినప్పటి నుండి మండల కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా చీలిపోయింది.
నియోజకవర్గ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి, భువనగిరి ఎంపీ చామల్ల కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గాలుగా కొందరు కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ కూడా సీఎం సహాయ నిధి నుంచి నిధులు ఇప్పిస్తూ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. దీంతో నర్మెట మండలంలో ఎన్ని వర్గాలు ఉన్నాయోనని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అధికారంలో ఉండి కూడా ఇలా గ్రూపులుగా వీడిపోవడం ఏంటని గ్రామస్థాయి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం పార్టీ మండల కార్యాలయంలో ఓ వర్గానికి చెందిన నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి, తమకు ప్రాధాన్యం కల్పించడం లేదని, తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని బాహాటంగానే డిమాండ్ చేశారు. మంగళవారం రోజున ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డికి, టీపీసీసీ కార్యాలయ ఇంచార్జికి, బీసీ కార్పొరేషన్ చైర్మన్‌కు నర్మెటకు చెందిన కన్నెబోయిన రామకృష్ణకు మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని పలువురు వినతిపత్రం అందించారు.
బుధవారం నిర్వహించిన సీఎంకు పాలాభిషేకం కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహించడంతో సామాన్య కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అధికార పార్టీలో రెండు వర్గాలు ఏర్పడటంపై మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. అభివృద్ధిలో, నిధుల మంజూరు చేయించడంలో గ్రూపులు తమ సత్తాను చాటుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.








