సోమవారం (ఓరుగల్లు న్యూస్) జూలై 06
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష ఎన్నిక కార్యకర్తల అభీష్టం మేరకు జరగలేదని, అర్హులకు పదవి దక్కలేదని సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీనారాయణ ఆరోపించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి ఎన్నిక కార్యకర్తల అభీష్టం మేరకు జరగలేదని, అర్హులకు అధ్యక్ష పదవి దక్కలేదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మండల అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి గత ముప్పై ఏళ్లుగా జెండాను మోసిన వారికి గుర్తింపు ఇవ్వాలని అన్నారు. పార్టీ నాయకత్వం ఆలోచించి అధ్యక్ష మార్పు చేయాలని, అన్ని గ్రామాల నాయకులు, మండల నాయకుల అభిప్రాయం సేకరించాలని వారు కోరారు. మరోసారి ఆలోచించి నూతనంగా అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపగోని శ్రీధర్, బూస ఆంజయ్య, కల్యాణం మురళి, కూకట్ల చంద్రమౌళి, కన్నెబోయిన రామకృష్ణ, బండి అశోక్, సారాబు మధు, గొట్టె రాజశేఖర్, రామకృష్ణ, బండి రమేష్, ముక్కెర రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.











