అనారోగ్యంతో బాధపడుతున్న మండల కేంద్రానికి చెందిన సంగ వెంకటేశ్వర్లుకు బీఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు కేశిరెడ్డి రాకేశ్ రెడ్డి అండగా నిలిచారు. ఆయన దృష్టికి అనారోగ్య సమస్యను తీసుకెళ్లగా.. వెంటనే స్పందించిన కేశిరెడ్డి రాకేశ్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విషయం వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే రూ.2 లక్షల ఎల్ఓసీని మంజూరు చేశారు.
గురువారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన కేశిరెడ్డి రాకేశ్ రెడ్డి, రూ.2 లక్షల ఎల్ఓసీ పత్రాన్ని వెంకటేశ్వర్లుకు అందజేశారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆపదలో వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించేందుకు చొరవ చూపిన బీఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డికి, సహకరించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనగామ యాదగిరి, మాజీ మార్కెట్ డైరెక్టర్ రంగు హరీష్ గౌడ్ పాల్గొన్నారు.









