జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి () మాజీ ఐపీఎస్ అధికారి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని మిత్ర () కార్యక్రమంలో జాతీయ మెంటార్‌గా నియమించింది. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టింది.
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి () మాజీ ఐపీఎస్ అధికారి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని మిత్ర () కార్యక్రమంలో జాతీయ మెంటార్‌గా నియమించింది. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అనుభవజ్ఞులైన నిపుణులు ఆన్లైన్ ద్వారా మార్గదర్శనం చేయనున్నారు. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలు, వృత్తిపరమైన అభివృద్ధి, తరగతి గది నిర్వహణను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇటీవల ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో కిరణ్ బేడీని అధికారికంగా ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మిత్ర కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, వచ్చే నెలలో తన తొలి మార్గదర్శక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.


