నంగునూరు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 22
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం మగ్ధుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని జాప రేణుక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఆమె గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం మగ్ధుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని జాప రేణుక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఆమె గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి సుధాకర్ ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయుడు తడకంటి రాజు మార్గదర్శకత్వంలో కబడ్డీలో మెళకువలు నేర్చుకున్న రేణుక తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగింది. పాఠశాల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి, మండల స్థాయి ఎస్జీఎఫ్ 14 ఏళ్లలోపు బాలికల కబడ్డీ పోటీలకు ఎంపికైంది.
మండల స్థాయి పోటీల్లో రేణుక ప్రాతినిధ్యం వహించిన పాఠశాల జట్టు ప్రథమ బహుమతి సాధించడంతో, ఆమె జిల్లా స్థాయి జట్టుకు ఎంపికైంది. గత నెలలో సిద్ధిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడల్లో నంగునూరు మండలం తరఫున బరిలోకి దిగిన రేణుక డిఫెండర్‌గా, రైడర్‌గా అద్భుత ప్రతిభ కనబరిచింది. ఆమె ఆటతీరుతో నంగునూరు మండల జట్టు జిల్లా స్థాయిలో మూడో స్థానాన్ని సాధించింది. దీంతో సెలెక్టర్లు ఆమెను జోనల్ స్థాయి (ఉమ్మడి మెదక్ జిల్లా) జట్టుకు ఎంపిక చేశారు.
ఈ నెల 19న మెదక్ పట్టణంలో నిర్వహించిన జోనల్ స్థాయి కబడ్డీ పోటీల్లోనూ రేణుక తన ఆల్‌రౌండ్ ప్రతిభను చాటుకుంది. డిఫెండర్‌గా, రైడర్‌గా రాణించి, సిద్ధిపేట జిల్లా జట్టు రెండో స్థానం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో సెలెక్టర్లు ఆమెను రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక చేశారు.
ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు మహబూబాబాద్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం రేణుక బయలుదేరి వెళ్లింది.
అభినందనలు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జాప రేణుకతో పాటు, ఆమెకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు తడకంటి రాజును మగ్దుంపూర్ సర్పంచి పాకాల శ్రీనివాస్, ఉప సర్పంచి లాస్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్ బండారి లక్ష్మి, మాజీ సర్పంచులు అచ్చిన మల్లయ్య, మయోజు చక్రపాణి, కడారి ప్రభాకర రెడ్డి, మాజీ ఎంపీటీసీ బట్ట బలరత్నం, గ్రామ పెద్దలు వాసరి యాదమల్లు, అచ్చిన సత్తయ్య, శేరి సురేందర్ రెడ్డి, మంత్రి కొమురయ్య, అలిబిల్లి నర్సింగ రావు, పాకాల రాజయ్య, పాలెపు లచ్చాగౌడ్, మాయోజు రాజు, తాటికొండ రాజు, అచ్చిన హరికిషన్, జెల్ల పోచయ్య, పోతిరెడ్డి రాములు, స్వామి, పాలెపు శ్రీనివాస్, బట్ట బాలకిషన్, తిరుపతి, వాసరి శ్యామ్, జాప హరికిషన్, పలారపు పరమేశ్వర్ రెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి సుధాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండారు ప్రసాద రెడ్డి, ఉపాధ్యాయులు జీడిపల్లి సురేందర్ రెడ్డి, దుద్దెడ పరశు రాములు, భైరు సత్తయ్య, దీకొండ గోవర్థన్, అదిరాల సాయినాథ శర్మ, ముస్మీరు రాజయ్య, అనరాజు స్వప్న, కల్లూరి నర్సింలు, విజయలక్ష్మి తదితరులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రేణుక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, మండలానికి, గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తే వారు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించగలరని ఈ విజయం మరోసారి నిరూపించిందని పలువురు పేర్కొన్నారు.







