తరిగొప్పుల, 14 October
సామాజిక సేవ
కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాటను చేతల్లో చూపిస్తూ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన మండల కేంద్రానికి చెందిన కొయ్యడ నాగరాజుకు కృత్రిమ కాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చి, ఆ మాటను నిలబెట్టుకుంటూ రూ.1.25 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఎల్ఓసీ మంజూరుకు కృషి చేసి, బాధితుడికి అందజేశారు.
కొయ్యడ నాగరాజు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, కొన్ని రోజుల క్రితం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆ సమయంలో కృత్రిమ కాలు ఏర్పాటు చేయడానికి సహకరిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.1.25 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ మంజూరుకు కృషి చేసి, స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి అందజేశారు. దీంతో నాగరాజు కుటుంబంలో కొత్త ఆశలు చిగురించాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారినప్పుడు వారికి అండగా నిలవడం ఎంతో అవసరమన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేదలు వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో బాధితులకు సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొయ్యడ నాగరాజుకు కృత్రిమ కాలు ఏర్పాటు చేయిస్తానని ఇచ్చిన మాట ప్రకారం సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ మంజూరుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే తన లక్ష్యమని తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ మంజూరుకు సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పండుగ కనకయ్య, మాజీ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్, మాజీ ఎంపీటీసీ కుమార్, సీనియర్ నాయకులు అర్జుల అంజిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, మంద చంద్రయ్య, లేగల అంజయ్య, సోషల్ మీడియా ప్రతినిధి కొయ్యడ రాజు, కృష్ణ, ఓబీసీ నాయకుడు వెంకట్ యాదవ్, సేవాదళ్ నాయకుడు వెంకట్ రెడ్డి, నాని తదితరులు పాల్గొన్నారు.










