ధూళిమిట్ట (ఓరుగల్లు న్యూస్) అక్టోబర్ 21
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సాయం అందింది. జనగామ నియోజకవర్గంలోని మద్దూరు, మండలాలకు చెందిన పది మంది లబ్ధిదారులకు దాదాపు రూ.4 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ పంపిణీ చేశారు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సాయం అందింది. జనగామ నియోజకవర్గంలోని మద్దూరు, మండలాలకు చెందిన పది మంది లబ్ధిదారులకు దాదాపు రూ.4 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ పంపిణీ చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా బాధిత కుటుంబాల పరిస్థితిని తెలుసుకున్న నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, సీఎంఆర్ఎఫ్ నిధుల మంజూరుకు చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో మంజూరైన చెక్కులను బుధవారం మండల కేంద్రంలో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తుల సమక్షంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి ఆర్థిక సాయం పొందిన వారిలో భూసన బోయిన స్వరూప, జాటోత్ శంకర్, బియ్య రాకేష్, తీగుళ్ల బాబు, రాకేశ్ చౌదరి, కొడాలి పూర్ణచందర్రావు, ఉత్కం శ్రీను, బండారు స్వాతి, జైన సతీష్, తాటికొండ లక్ష్మీదేవి ఉన్నారు. చెక్కుల మంజూరుకు సహకరించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్లకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ లీలా జగన్మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ తుశాలపురం రాజు, కొమురవెల్లి దేవస్థానం మాజీ డైరెక్టర్ రమణారెడ్డి, తోర్నాల గ్రామ మాజీ సర్పంచ్ గోనెపల్లి పరుశరాములు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం, గోనెపల్లి రమేష్, రాజు, రచ్చ బాలయ్య, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు బండారి సతీష్, నాచగోని రితేష్ గౌడ్, మేడిపల్లి చందు, చింతల వేణు తదితరులు పాల్గొన్నారు.











