కష్టకాలంలో కార్యకర్తలు, వారి కుటుంబాలకు అండగా నిలవడమే తమ బాధ్యత అని బీఆర్ఎస్ నాయకులు మరోసారి చాటిచెప్పారు. మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి పోశయ్య కుమారుడు తాళ్లపల్లి రవి గౌడ్ దశదినకర్మ కార్యక్రమానికి పార్టీ నాయకులు హాజరయ్యారు.
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై, రవి గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రవి గౌడ్ మృతితో కుటుంబానికి తీరని లోటు ఏర్పడిందని నాయకులు పేర్కొన్నారు.
విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తల కుటుంబాలకు ఎలాంటి కష్టం వచ్చినా నాయకత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగరావు, జనగామ జిల్లా నాయకులు పెద్ది రాజిరెడ్డి, అధికార ప్రతినిధి చిలువేరు లింగం, మాజీ సర్పంచ్ దామెర ప్రభుదాస్, చింతల జైపాల్, సుంకరి కనకరాజు, పొగాకుల రవి, బత్తిని సురేందర్, చెన్నూరి సంజీవులు, ఆవుల రాములు, మల్యాల సుధీర్, పాండ్యాల శ్రీను, కొయ్యడ రాజు తదితరులు పాల్గొన్నారు.












