అభినందనలు తెలిపిన జనగాం మున్సిపల్ చైర్ పర్సన్
చేర్యాల మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, శ్రీనివాస్ దంపతులు సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వారు నూతన చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సన్మానించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్‌రెడ్డి ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని వారు ఆకాంక్షించారు.











